ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన శ్రీలంక- పాకిస్తాన్ తొలి టెస్టులో పర్యాటక జట్టునే విజయం వరించింది. గాలే వేదికగా ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. ఐదో రోజు గెలుపు కోసం మరో 120 పరుగులు కావాల్సిన తరుణంలో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ 160 అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. తద్వారా 342 పరుగులు ఛేదించి… గాలే స్టేడియంలో అత్యధిక ఛేజ్ చేసిన జట్టుగా పాక్ నిలిచింది. లక్ష్యఛేదనలో భాగంగా 222-3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన పాక్‌కు మహ్మద్ రిజ్వాన్ (74), షఫీఖ్‌లు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని ప్రభాత్ జయసూర్య విడదీశాడు.
అతడు వేసిన 103.1 ఓవర్‌లో రిజ్వాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే క్రమంలో అఘ సల్మాన్(12), హసన్ అలీ (5) వికెట్లను శ్రీలంక బౌలర్లు పడగొట్టారు. 303 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలించడంతో లంక శిబిరంలో ఆశలు రేగాయి. అదే సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ డ్రా అవుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే వర్షం ఆగిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. అయితే సంచనాలకు తావివ్వకుండా షఫీక్ మ్యాచ్‌ను ముగించాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఇమాముల్ హక్(35), కెప్టెన్ బాబర్ ఆజామ్(55), మహమ్మద్ రిజ్వాన్ (40) రాణించారు.
ఇక శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగగా… రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసి పాక్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అబ్దుల్లా షఫీఖ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విషయంతో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఇక సిరీస్‌లో నిర్ణయాత్మక రెండో టెస్టు జులై 24 నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ తొలి టెస్టును విజయంతో ప్రారంభించింది. వర్షం అంతరాయం కలిగించినా ఈ మ్యాచ్‌లో పాక్ విజయాన్ని ఆపలేకపోయింది.
స్కోరు బోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: 222, 337
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 218, 344/6
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.