భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించగా, తాజాగా ఆ జాబితాలో పొరుగునే ఉన్న శ్రీలంక కూడా చేరింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా శ్రీలంకలో గత 5 రోజులుగా 2 వేల వరకు కొత్త కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం.
భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించిన శ్రీలంక
By ramesh nalam
- Tags
- breaking news telugu
- CORONA VIRUS
- COVID 19
- Flights
- important news
- Important News This Week
- Important News Today
- india
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- srilanka
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement