Thursday, November 21, 2024

AP: సరస్వతి అలంకరణలో శ్రీ కనకదుర్గమ్మ..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా పురాణాల్లో పేర్కొన్నారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

శుద్ధ సత్వ గుణ శోభిత, శ్వేత వస్త్రాలతో అలంకృతయై, హంస వాహినిగా తామర పుష్పం మీద సరస్వతి దేవిగా అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఆమె అక్షరమాల, గ్రంథం ధరించడంతో పాటు వీణావాదనం చేస్తుంటు, వేదాలు సైతం సరస్వతి దేవి నుండే ఆవిర్భవించయని వేదాలు చెబుతున్నాయి. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అయిన వసంత పంచమి బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలోని కనకదుర్గమ్మ వారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

వసంత పంచమి రోజున తెల్లవారుజామునుండే అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు తరలివచ్చారు. ఆలయంలోని మహా మండపం ఆరవ అంతస్తులు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య నేతృత్వంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ అమ్మవారి చెంత పెన్నులు, కుంకుమ, రక్ష, ఫోటోలను ఉంచి ప్రత్యేక పూజలు అనంతరం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థికి పెన్నులను బహుకరించే విధంగా 50 వేలకు పైగా పెన్నులను అధికారులు సిద్ధం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement