Tuesday, November 19, 2024

శ్రీ చైతన్య చీటింగ్‌ !

ప్రభ న్యూస్‌ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్‌ ప్రతినిధి : ఖమ్మంలో పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన శ్రీ చైతన్య పాఠశాలల డొల్లతనం బయటపడింది. పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లు నడుస్తోంది శ్రీ చైతన్య పాఠశాలల వ్యవహారం. దాదాపుగా ప్రతి పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలు పుట్టుకొచ్చాయి. కార్పోరేట్‌ స్థాయి చదువుల పేరుతో చేసే ప్రచారం..హడావుడితో తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ చేర్పిస్తున్నారు. చెప్పే మాటలకు..చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఇబ్బడిముబ్బడిగా అడ్మిషన్లు తీసుకోవడం.. అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన సాగించడం.. ఇరుకైన గదులలో తరగతులు నడిపించడం.. రకరకాల పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలోని రెండు ప్రధాన పట్టణాలలో శ్రీ చైతన్య పేరిట పాఠశాలలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌.. తాండూ రులలో శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయి. వీటి అనుమతులను రెన్యూవల్‌ చేసుకునేందుకు అనుసరించిన విధానంతో రెండు శ్రీచైతన్య బ్రాంచ్‌లకు ఎసరు వచ్చింది. ప్రతిఏటా పాఠశాలలకు ఇచ్చిన అనుమతులను రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పలు రకాల పత్రాలను యాజమాన్యాలు సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో అగ్నిమాపక శాఖ నుంచి జారీ చేసే ఫైర్‌ సేఫ్టీ పత్రం కీలకం. పాఠశాల భవనం ఎత్తు 6 మీటర్లు దాటితే ఖచ్చితంగా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్‌ సేఫ్టీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని వికారాబాద్‌.. తాండూరులలో కొనసాగుతున్న శ్రీ చైతన్య పాఠశాలలు నాలుగు అంతస్తుల భవనంలో ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత శ్రీ చైతన్య పాఠశాలలు సమర్పించిన ఫైర్‌ సేఫ్టీ ధృవీకరణ పత్రంపై వివాదం ఏర్పడింది. దొంగ ఫైర్‌ సేఫ్టీ పత్రాలను సమర్పించి గుర్తింపును రెన్యూవల్‌ చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.


చైల్డ్‌ ఫోరం అనే సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకవచ్చింది. శ్రీ చైతన్య పాఠశాలలు పొందిన ఫైర్‌ సేఫ్టీ పత్రాలను సమాచార హక్కు చట్టం ప్రకారం చైల్డ్‌ ఫోరం ప్రతినిధులు సంపాదించారు. వీటిని జారీ చేసిన మహబూబ్‌నగర్‌ రీజియన్‌ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. శ్రీ చైతన్య పాఠశాలలు సమర్పించిన ఫైర్‌ సేఫ్టీ పత్రాలను తాము జారీ చేయలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై చైల్డ్‌ ఫోరం ప్రతినిధులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ పత్రాలను సమర్పించి వికారాబాద్‌, తాండూరు శ్రీ చైతన్య పాఠశాలల గుర్తింపును రెన్యూవల్‌ చేసుకోవడంపై విద్యా శాఖ తీవ్రంగా స్పందించింది. రెండు బ్రాంచ్‌లను ఏప్రిల్‌ 23 నుంచి మూసివేయాలని ఆదేశించింది. మొత్తంగా రెండు పాఠశాలలను షట్‌ డౌన్‌ చేయాలని విద్యాశాఖ ఆర్‌జేడీ జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు. మరోవైపు తమ పేరిట దొంగ పత్రాలను సంపాదించి సమర్పించిన శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యంపై అగ్నిమాపక శాఖ అధికారులు వికారాబాద్‌, తాండూరు పోలీస్‌స్టేషన్‌లలో కేసు పెట్టారు. ప్రస్తుతం వికారాబాద్‌, తాండూరు శ్రీ చైతన్య పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఏప్రిల్‌ 23 తరువాత షట్‌ డౌన్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశించిందని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య వెల్లడించారు.

పాపం పండింది..

పాపం ఎక్కువ రోజులు దాగవు.. లక్షలాది మంది విద్యార్థులను మోసం చేస్తూ వేలాది కోట్లు- సంపాదిస్తున్న శ్రీ చైతన్య ఆటలకు బ్రేకులు పడ్డాయి. అంతా మేమే అంటూ విర్రవీగిన కాలేజ్‌ ఆటలకు బ్రేకులు పడ్డాయి. ఇక ముందు వీరి ఆటలు సాగకుండా కట్టు-దిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇటీ-వల సాత్విక్‌ ఆనే విద్యార్థి కాలేజీ యాజమాన్యం పెట్టే చిత్ర హింసలకు భరించలేక ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దిద్దుబాటు- చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే సోమవారం ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారి నవీన్‌ మిట్టల్‌ అధ్యక్షతన కార్పొరేట్‌ కాలేజీలు…ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలతో కీలక సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నార్సింగి లోని శ్రీ చైతన్య కాలేజీ లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని మానసికంగా ఇబ్బందుల పాలు చేయడంతో ఆత్మ హత్య చేసుకున్నాడు. విచారణలో కూడా అదే తేలింది. దీంతో విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్న శ్రీ చైతన్య కాలేజీ అనుమతి రద్దు చేస్తున్నట్లు- ప్రకటించారు. ఈసారి మొదటి సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు రద్దు చేశారు. దాంతోపాటు- కార్పొరేట్‌ కాలేజీల్లో ఇక ముందు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించనున్నారు. కొన్ని సంవత్సరాలుగా అందరినీ మోసం చేస్తూ పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద సాత్విక్‌ ఆత్మ హత్య పై విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సీరియస్‌ అయ్యారు. విచారణకు ఆదేశించడం విచారణలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే విషయం తేలింది. దీంతో శ్రీ చైతన్య ఆగడాలకు బ్రేకులు పడ్డాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement