హనుమకొండ : ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాలలు నడుపవద్దని విద్యా శాఖ అధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో(హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు) ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా, ప్రైవేట్ టీచర్ లను విధులకు హాజరు కావాలని, ఎలాంటి లీవ్ లు ఇవ్వ కూడదని, టీచర్లను బానిసలను చేస్తుంది శ్రీచైతన్య యాజమాన్యం అని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరమ్(టిపిటిఎఫ్)ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి సునిల్ కుమార్ డిమాండ్ చేసారు.
ప్రైవేట్ స్కూల్ టీచర్లకు శాపం..
తేదీ 11, 12 మార్జి 2023 అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు ఖచ్చితంగా టీచర్లు అందరూ పాఠశాల రావాలని, సెలవులు ఇవ్వడం కుదరదని శ్రీ చైతన్య పాఠశాలలకు చెందిన వరంగల్, ఖమ్మం జోన్ ల ఇంఛార్జ్ రాంకీ హుకుం జారీ చేసారు. శనివారం వరకు సరే గానీ ప్రభుత్వ నిభందనలు తుంగలో తొక్కి ఆదివారం కూడా తప్పకుండా స్కూల్ కి రావాలని అనడం ఏంటి? అని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరమ్ ప్రశ్నిస్తుంది. ఇందులో ఇంకో విషయం ఏమిటంటే ఈ శనివారం, ఆదివారం మిగతా స్కూల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా టీచర్లను కట్టడి చేయడానికి శ్రీ చైతన్య యాజమాన్యం పన్నిన పన్నాగంలా అనిపిస్తుంది అన్నారు. ఈ పన్నాగంలో బలి పశువులు టీచర్లు. ఆదివారం కూడా అడ్మిషన్ల పేరిట తిప్పుతున్న శ్రీ చైతన్య నుండి తెలంగాణలో ప్రతీ ప్రైవేట్ టీచర్ శ్రమ దోపిడీ నుండి వాళ్ల అరాచకాల నుండి విముక్తి కావాలి అని వాపోయారు. ఇప్పటికైనా శ్రీచైతన్య విధానాలు మార్చుకొకపోతే టిపిటిఎఫ్ తరపున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరమ్(టి పి టి ఎఫ్)ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి సునిల్ కుమార్ డిమాండ్ చేసారు.