Saturday, November 23, 2024

SRH vs RR | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజర్స్‌

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (గురువారం) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గ‌త మ్యాచుల్లో బెంగళూరు, చెన్నైలతో ఆడిన స‌న్‌రైజర్స్ హైదరాబాద్… లక్షఛేదనలో విఫలమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక హైదరాబాద్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానంది.

తుది జట్లు :

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, టీ.నటరాజన్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్ :

SRH: ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్

RR: జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్

హైద‌రాబాద్‌కు పెద్ద సవాల్…

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్‌కు రాజస్థాన్ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే లక్షంతో సన్‌రైజర్స్ ఉంది. దాంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాల్‌గా మారింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అసాధారణ ఆటతో అలరిస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ ఏకంగా 8 పోటీల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ ఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లను ఆడి ఐదు మ్యాచ్‌లో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement