ఉప్పల్ స్టేడయంలో జరగుతున్న మ్యాచ్‌లో… తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో హైదరాబాద్ ముందు మోస్తరు టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లల 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టాస్ గెటిచి బ్యాటింగ్‌కు దిగన లక్నో ను హైదరాబాద్ కట్టడి చేసింది. అయితే, ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్లాల్లో ఉన్న జట్టును బడోని, పూరన్ ఆదుకున్నారు. దూకుడు బ్యాటింగ్‌తో స్కోర్‌బోర్డ్‌పై పరుగులు పెంచారు.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (29), కృనాల్ పాండ్యా (24) పరుగులకే వెనుదిరిగారు. టాపార్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (48), బదోని (55) మెరుపు ఇన్నంగ్స్ ఆడి జట్టుకు కీలక స్కోర్ అందించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒక్క వికెట్ దక్కించున్నాడు. ఇక 166 పరుగుల టార్గెట్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఛేజింగ్‌కు దిగనుంది.