హైదరాబాద్ – ఐపీఎల్ లో వరుసుగా రెండు మ్యాచులు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు తొలి విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టు తో జరిగిన మ్యాచులో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సొంతగడ్డపై చెలరేగిన మర్‌క్రం సేన పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రాహుల్ త్రిపాఠి(74) ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. కెప్టెన్ మర్‌క్రం(37) అజేయంగా నిలిచాడు. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న పంజాబ్‌కు నిరాశే మిగిలింది. . పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేదించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 143 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసిన అతను సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్‌కు 55 రన్స్ జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది