Tuesday, November 26, 2024

Paris Olympics | శ్రీజేశ్‌కు మ‌రో అరుదైన అవ‌కాశం…

పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా భారత యువ షూటర్‌ మను బాకర్‌కు ఛాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది. క్రీడాకారుల అభీష్టం మేరకు శ్రీజేశ్‌ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు.

శ్రీజేశ్‌ గత రెండు దశాబ్దాలకుపైగా భారత్‌ క్రీడలకు, హాకీకి అద్భుతమైన సేవలందించారన్నారు. జావెలిన్‌ త్రోలో రజతం సాధించిన నీరజ్‌ చోప్రాతో తాను మాట్లాడానని, ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ పతాకధారిగా ఉండేందుకు అతడు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

తాజాగా భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. అనంతరం సీనియర్‌ గోల్ కీపర్ శ్రీజేశ్‌ తన హాకీ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి ఈ అరుదైన గౌరవం లభించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement