శ్రీజ కొణిదెల భర్తతో విడిపోయారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారు. వీరి కుమార్తె నవిష్క తల్లి వద్ద ఉంటున్నారు. కోర్టు నవిష్క గార్డియన్షిప్ శ్రీజకు ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు అనుమతి మేరకు అప్పుడప్పుడు నవిష్కను కళ్యాణ్ దేవ్ కలుస్తున్నాడు. కారణం తెలియదు కానీ 2021లో శ్రీజ-కళ్యాణ్ దేవ్ మధ్య గొడవలు జరిగాయి. శ్రీజ సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుండి భర్త పేరు తొలగించింది. అక్కడ విడాకుల రూమర్స్ కి బీజం పడింది. ఆపై శ్రీజ భర్తతో కలిసి కనిపించలేదు. కూతుళ్ళ బర్త్ డే వేడుకల్లో కళ్యాణ్ దేవ్ మిస్. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారన్న స్పష్టత వచ్చింది.
ఇక శ్రీజ మూడో వివాహం చేసుకుంటారనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. నా ఒడిదుడుకుల్లో ప్రశాంతతవు, చీకటిలో వెలుగువు, 14 ఏళ్ల వయసులో నీతో అనుబంధం మొదలైంది. నేను నిద్ర లేస్తున్నానంటే నీ కోసమే… అని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేసింది. ఎవరో ప్రియమైన వ్యక్తిని తలచుకుంటూ చెప్పినట్లున్న ఆ రొమాంటిక్ కామెంట్స్…. శ్రీజ కాఫీని ఉద్దేశించి చేశారు. కాఫీ అంటే శ్రీజకు ఎంతో ఇష్టమట. 14 ఏళ్ల వయసులో కాఫీ తనకు అలవాటైందట. అప్పటి నుండి కష్టనష్టాల్లో కాఫీ ఆమెకు తోడుగా ఉందట. నిద్రలేవగానే కాఫీ మొదటి సిఫ్ ఆమెకు గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పకనే చెప్పింది.