Tuesday, November 26, 2024

డయాబెటిక నివారణకు శ్రీ క్యూర్‌..

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : డయాబెటిక్‌ వ్యాధి నివారణకు ఆధునికి సాంకేతికను ఉపయోగించి తయారు చేసిన శ్రీ క్యూర్‌ ఔషదాన్ని శ్రీవర్‌ ఫార్మా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మారియట్లో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మెన్లు రామక్రిష్ణ, ప్రభావతి, మేనేజింగ్‌ డైరెక్టర్లు అరుణా ఠాగుర్‌, కల్పనలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డయాబెటిక్‌, సొరియాసిస్‌, పొలుసు తదితర వ్యాధుల సతర నివారణకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా ప్రకృతి పరంగా లబించే అయిల్స్‌, విటమిన్ల సమ్మేళనంతో ఈ ఔషదాన్ని తయారు చేసినట్టు తెలిపారు.

అమెరికా మార్కెట్లో సక్సెస్‌ అయిన ఈడ్రగ్‌ హక్కులను ఇండియాలో తమ సం స్థ పొందిందని అన్నారు. ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 300, ఇండియా వ్యాప్తంగా రాబోయే ఐదేండ్లలో 10 వేలకు పైగా థెరపటిక్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. క్లినిక్‌లోనే కాకుండా డోర్‌ డెలివరి సరీస్‌ అందించనుట్టు పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో బోన్‌ స్ట్రేంత్‌, మల్టిd విటమిన్‌, ట్రెస్‌ రిలీఫ్‌ కోసం ఔషదాలను మార్కెట్లో ప్రవేశ పెట్టినట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement