Tuesday, November 19, 2024

మధ్యతరగతి జీవితాలకు ఎస్‌ఆర్‌ విద్యా భరోసా.. సాధారణ ఫీజులతో నాణ్యమైన విద్య

కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తూ.. సాధారణ స్కూళ్లకు సరిసమానమైన ఫీజులు వసూలు చేస్తూ ఎస్‌ఆర్‌ డిజి విద్యాసంస్థ లు డిజిటల్‌ విద్యాబోధననందిస్తున్నాయి… తెలంగాణ సర్కార్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన విద్యనందిస్తూ.. అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ.. ఏడాదికేడాది పురోగతి సాధిస్తూ.. ఉన్నత విద్యా ప్రమాణాలతో ప్రజల మనస్సులను సొంతం చేసుకుంటున్నాయి ఈ విద్యాసంస్థ లు… మధ్యతరగతి.. సామాన్య విద్యార్థులకు సైతం కార్పొరేట్‌ విద్యనందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఎస్‌ఆర్‌ విద్యాసంస్థ ల అత్యుత్తమ బోధనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది…

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్ : తెలంగాణాలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించిన ఎ స్‌ఆర్‌ డిజి విద్యా సంస్థ లు సామాన్యులకు అందుబాటు ఫీజులతో కార్పొరేట్‌ విద్యనందిస్తున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థ లకు ధీటుగా విద్యాబోధనందిస్తూ, అత్యున్నత ఫలితాలను సొంతం చేసుకుంటున్నాయి. ఎస్‌ఆర్‌ విద్యాసంస్థ ల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్‌ సంతోష్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతోంది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు కేవలం రూ.20 నుంచి 40 వేలలోపు నామమాత్రపు ఫీజులతో డిజిటల్‌ విధానంలో విద్యనందించడం సామాన్య విద్యార్థులకు సైతం ఊరటనిస్తోంది. ఇంటర్‌ మీడియట్‌ విద్యను సైతం అతి తక్కువ ఫీజుతో అందిస్తూ, కేవలం రూ.50వేల నుంచి లక్ష రూపాయలను హాస్ట ల్‌ ఫీజుతో కలిపి వసూలు చేస్తూ, నాణ్యమైన ఆహారం అందించడం గమనార్హం. హాస్ట ల్‌ విద్యార్థులకు ప్రతి నిత్యం గుడ్డు, వారంలో రెండు రోజుల పాటు మాంసాహారం అందిస్తున్నారు.

అత్యున్నత ప్రమాణాలు – అద్భుత ఫలితాలు..

2021 జేఈఈ మెయిన్‌లో జాతీయస్థాయిలో 2, 3 ర్యాంకులతో పాటు వెయ్యి లోపు 24మంది ర్యాంకులు సాధించారు. అదే విధంగా ఈ ఫలితాల్లో 926 మంది అర్హత సాధించారు. అదే ఏడాది నీట్‌, ఎంసెట్‌లోనూ ఉత్తమ ర్యాంకులు సాధించారు. 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ప్రచోధన్‌ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 2018, 2019 లోనూ అత్యుత్తమ ఫలితాలు జేఈఈలో వచ్చాయి. 2022 ఎస్సెస్సీ ఫలితాల్లోనూ 229 మంది విద్యార్థులు 10/10 జీ పీఏ సాధించడం గమనార్హం. 2022 ఇంటర్‌ మీడియట్‌ ఫలితాల్లోనూ 992 ఒకరికి, 990 మార్కులు ఇరువురికి, బైపీసీ విభాగంలో 991 ఆరుగురికి, 990 ఆరుగురికి ఎంపీసీలో, 983 ఎంఈసీ, 979 సీఈసీ విభాగాల్లో ఎస్‌ఆర్‌ విద్యార్థులు సాధించి, సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ ఎంపీసీ విభాగంలో 467 మార్కులు 36మందికి, 466 156 మందికి, బైపీసీ విభాగంలో 437 9మందికి, 436 మార్కులు 76మందికి, ఎంఈసీ 492 ఇరువురికి, 491 మార్కులతో సీఈసీ టాపర్స్‌గా ఈ విద్యాసంస్థ ల విద్యార్థులు నిలిచారు.

లాభాపేక్ష లేకుండానే విద్యాబోధన..

- Advertisement -

2010లో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ విద్యాసంస్థ లు ప్రజల ఆదరణతో దినాదినాభివృద్ధి చెందుతున్నాయి. దాదాపు లక్షమంది విద్యార్థులు ఈ సంస్థ ల్లో విద్యనభ్యసిస్తున్నారు. కరోనా వేళ ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి, ఫీజులను కూడా పూర్తిస్థాయిలో తగ్గించి, ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు చెల్లించలేని వారికి రాయితీలనిచ్చి యాజమాన్యం అండగా నిలిచింది. ఆది నుంచి తెలంగాణా పోరాటంలో భాగ స్వామ్యం కావడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది.

సామాన్యులకు ప్రైవేట్‌ విద్యను చేరువ చేయడమే లక్ష్యం..

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాల్లోని విద్యార్థులకు సైతం మెరుగైన విద్యనందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎస్‌ఆర్‌ డిజి విద్యాసంస్థల డైరెక్టర్‌ సంతోష్‌ రెడ్డి తెలిపారు. ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ అతితక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యనందించడం, విద్యార్థులందరికీ అర్థమయ్యేలా డిజిటల్‌ విద్యా విధానాన్ని అవలంభించడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలను పాటిస్తూ, గతేడాది ఐఐటీలో రెండో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తమ విద్యార్థి ప్రచోదన్‌ మంచి ర్యాంకు సాధించడం తమ కృషికి నిదర్శనమని, ఈసారి కూడా మెరుగైన ర్యాంకులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement