Tuesday, November 26, 2024

అన్ని వేరియంట్లను అడ్డుకుంటున్న స్పుత్నిక్ వి..

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కరోనా అన్ని వేరియంట్లను అడ్డకుంటున్నట్లు గ‌మ‌లేయా నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ వెల్లడించింది. రష్యాకు చెందిన స్పత్నిక్ వి వి డెల్టా సహా కరోనా అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. నేరుగా వైర‌స్‌నే ఉప‌యోగించి చేసిన వైర‌స్ న్యూట్ర‌లైజింగ్ యాక్టివిటీ (వీఎన్ఏ)ని అంచ‌నా వేసి ఈ అధ్య‌య‌నం జ‌రిగిన‌ట్లు తెలిపింది. క‌రోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 స‌హా ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో క‌నిపించిన వేరియంట్ల‌ను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రేరిత సేరా ఎలా అడ్డుకుంటుందో ప‌రిశీలించారు.

అంతేకాదు ఇత‌ర వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారుల‌తో క‌లిసి వ్యాక్సిన్ కాక్‌టెయిల్స్‌ను త‌యారు చేసే దిశ‌గా గ‌మ‌లేయా, ఆర్డీఐఎఫ్ అధ్య‌య‌నం నిర్వ‌హిస్తోంది. ఇండియా స‌హా ప్ర‌పంచంలోని మొత్తం 67 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిజిస్ట‌ర్ అయింది. ఇండియాలో ఈ మ‌ధ్యే ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం ప్రారంభించారు. ఆల్ఫా బీ.1.1.7 (తొలిసారి యూకేలో క‌నిపించింది), బీటా బీ.1.351 (తొలిసారి సౌతాఫ్రికాలో క‌నిపించింది), గామా పీ.1 (బ్రెజిల్‌లో క‌నిపించింది), డెల్టా బీ.1.617.2, బీ.1.617.3 (ఇండియాలో క‌నిపించింది) వేరియంట్ల‌ను అడ్డుకునే టైట‌ర్ల‌ను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసిన‌ట్లు గ‌మ‌లేయా ఇన్‌స్టిట్యూల్ వెల్ల‌డించింది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్టీపీ.. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరు

Advertisement

తాజా వార్తలు

Advertisement