రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా ధరను అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు ఇవ్వనున్నట్లు అపోలో గ్రూపు అధికారి ఒకరు తెలిపారు. జూన్ రెండో వారం నుంచి దేశంలోని అన్ని అపోలో హాస్పిటళ్లలో ఈ టీకాలను ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌కు రూ.995 ఛార్జ్ చేస్తామని, ఇక అడ్మినిస్ట్రేషన్ ఫీజుగా మరో రూ.200 వసూల్ చేస్తామని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 80 చోట్ల పది లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని తెలిపారు. ఇక జూన్ నెలలో ప్రతి వారానికి పది లక్షల మందికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత జూలైలో దాన్ని రెండింతలు చేస్తామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా రెండు కోట్ల మందికి టీకాలు ఇస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement