కరోనాను కట్టడి చేయడానికి రష్యా ప్రభుత్వం స్సుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు అధ్యక్షుడు పుతిన్, ఆయన కూతురు స్వయంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదట వారు తీసుకున్నాకే ఇతరులకు వ్యాక్సిన్ ఇచ్చారు.
కాగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. రష్యాలో తయారైన మందులేవైనా ప్రతిభావంతంగా పనిచేస్తాయన్న పేరుంది. ఇప్పటికి అదీ కొనసాగుతుంది. అందుకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మంచి ఉదాహరణ అని, ఎన్నో విమర్శలు వచ్చినా కరోనాపై పోరులో అత్యంత నమ్మదగిన వ్యాక్సిన్ గా పేరు తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో స్పుత్నిక్ వీ ఇప్పుడొక ఏకే 47లా ఉందని పుతిన్ స్పష్టం చేశారు.