Friday, November 22, 2024

వైరల్ వీడియోః పారాలింపిక్స్‌లో లవ్‌ ప్రపోజల్‌!

టోక్యో పారాలింపిక్స్​లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. 200 మీటర్ల పరుగుపందెం పోటీ.. సెమీఫైనల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్​ చివర్లో ఓడిపోయిన స్ప్రింటర్‌ కి గైడ్ లవ్ ప్రపోజ్ చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగు పందెంలో సెమీఫైనల్స్‌ క్వాలిఫైంగ్‌ రౌండ్‌లో చివర్లో కేయులా నిద్రియా పెరీరా అనే యువతి ఓడిపోయింది. టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోవడంతో పెరీరా నిరుత్సాహంగా ఉంది. అప్పుడు తన వద్దకు వచ్చిన గైడ్ కోచ్‌ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా.. మోకాళ్ల మీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. దానికామె అంగీకరించడంతో ఒక్కసారిగా అక్కడున్న ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. అనంతరం ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. ఈ సర్‌ ప్రైజ్‌ లవ్‌ ట్రాక్‌ను టోక్యో 2020 పారాఅథ్లెటిక్స్‌ అధికారిక ట్విటర్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement