Friday, September 20, 2024

TG | రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ : సీఎం రేవంత్

రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. దీనిపై సౌత్ కొరియాలోని నేషనల్ స్పోర్ట్స్ వర్సిటీ ప్రెసిడెంట్ మూన్ వాన్-జేతో సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని క‌లిసి చర్చించిన‌ట్లు తెలిపారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ – కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ మధ్య భాగస్వామ్యం కోసం సవివరమైన చర్చలు జరిగాయని వెల్లడించారు. ఈ భాగస్వామ్యంపై స్పందించిన కొరియన్ యూనివర్సిటీ అధికారులు.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ భాగస్వామ్యంతో ఇక్కడ ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో రాష్ట్రంలోని యువతకు ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన లిమ్ సిహ్యోన్‌ను సన్మానించామని, ఇతర ఛాంపియన్‌లు, కోచ్‌లను కూడా కలిశామని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement