Friday, November 22, 2024

Sports: కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ .. చాంపియన్‌షిప్‌లో జిల్లీకి రజతం

తాష్కెంట్‌: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన జిల్లీ దాల్‌బెహరా రజతాన్ని కైవసం చేసుకుంది. ఒడిశాలోని గిరిజన మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన 22ఏళ్ల మహిళా లిఫ్టర్‌ జిల్లిd..49కిలోల కేటగిరీలో రెండోస్థానంలో నిలిచింది. కాగా ఇదే విభాగంలో మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మీరాబాయి విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఈవెంట్‌లో పాల్గొనలేదు. 45కిలోల జూనియర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత అయిన జిల్లి కామన్‌వెల్త్‌లో 49కిలోల విభాగంలో పోటీపడింది.

స్నాచ్‌లో 73కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 94కిలోలు మొత్తం 167కిలోలతో రజతాన్ని కైవసం చేసుకుంది. ఈ కేటగిరిలో నైజీరియాకు చెందిన పీటర్‌ స్టెల్లా కింగ్సీ 72 ప్లస్‌ 96కిలోలతో 168కిలోల బరువునెత్తి ప్రథమస్థానంలో నిలిచింది. ఈ టోర్నీ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌ అయినప్పటికీ వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్వాలిఫైయింగ్‌ ఈవెంట్‌గా పరిగణిస్తున్నారు. తాష్కెంట్‌లో స్వర్ణపతక విజేతలు మాత్రమే కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు అర్హులవడంతో రజతం సాధించిన జిల్లిd గురువారం తన బెర్త్‌ను ఖరారు చేసుకోలేకపోయింది. కాగా కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన జిల్లిd దాల్‌బెహరాకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement