Wednesday, November 20, 2024

Sports – 2036 లో ఒలింపిక్స్ నిర్వ‌హిస్తాం – ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్స్ క‌మిటీకి భార‌త్ లేఖ

ఢిల్లీ విశ్వక్రీడలు ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సమాయత్తమవుతోంది. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారికంగా లేఖను పంపింది.


2036 ఒలింపిక్స్ భారత్ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గమని గతంలో ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హ‌ణ‌కు సంసిద్దంగా ఉన్నామ‌ని పేర్కొంటూ ఐఓసి లేఖ‌ను పంపింది. కాగా, మరోపక్క.. 2028 (లాస్ ఏంజిలెస్), 2032 (బ్రిస్బేన్) ఒలింపిక్స్ వేదికలు ఖరారయ్యాయి. దాంతో అందరి చూపు 2036పై పడింది .


2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో బిడ్డింగ్ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఐఓసీ నాయకత్వ విభాగం ఈ ఆతిథ్య హక్కులను కట్టబెట్టే ఆస్కారం ఉంది. స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఐఓసీ కూడా భారత్ వైపు మొగ్గు చూసేందుకు ఆసక్తితో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement