- ఏ మార్గమైనా సరే.. ట్రాఫిక్ జామ్ సమస్య తప్పదు
- మరో పదిహేను రోజుల్లో పూర్తిస్థాయి వర్షాలు
- నగర రోడ్లపై గుదిబండలా ట్రాఫిక్ అంతరాయం
- -టై పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల సమాలోచన
- వర్షాకాలంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశాలు
- జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం
రానున్న వర్షాకాలంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీస్‌లు ప్రత్యేక చర్యలు తీసుకుంటు-న్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నగరంలో సాయంత్రం సమయంలో వర్షం పడుతుండటంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నగరంలో పలుచోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టు-కుని మరో పదిహేను రోజుల్లో వర్షాలు ప్రారంభం కానున్న నేపథ ్యంలో వాహనదారులను ట్రాఫిక్ సమస్య నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
– ప్రభ న్యూస్, హైదరాబాద్
నగరంలో ఏ మార్గంలో వెళ్లినా సరే ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే అనేక మార్గాల్లో ట్రాఫిక్ బెంబేలెత్తిస్తుంది. ఏమాత్రం వర్షం పడినా సరే, కిలోమీటర్ల మేరవాహనాలు క్యూ కడుతున్నాయి. ఫలితంగా వాహనదారులు ఎన్నో కష్టాలు పడి, ఇంటికి చేరుకోవాల్సి వస్తుంది. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు, నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు.
ముందస్తు ప్రణాళితో ట్రాఫిక్ సమస్యకు చెక్..
మరో పదిహేను రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వర్షాకాలం అనగానే, హైదారాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు పెద్ద గండమేనని చెప్పాలి. ముఖ్యంగా అధిక వర్షాలు కురిస్తే, నగరంలోని రోడ్లన్ని పూర్తిగా జలమయమవుతాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. ఇక అనేక మార్గాల్లో రోడ్లపై నీరు నిలిచి, వాహన రాకపోకలు సాగేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటు-ంది. వర్షానికి ఊహించనంతగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతోంది. ఫలితంగా నగర వాహనదారులు నరకం చూసిన ఘటనలు గతంలో నగరంలో అనేకసార్లు చోటు- చేసుకున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత నగరంలో ఊహించని స్థాయిలో కార్ల వినియోగం పెరిగింది. ఏ చిన్న మార్గమైనా సరే, ట్రాఫిక్‌తో చుక్కలు చూడాల్సి వస్తోంది. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని ట్రై పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు వర్షాకాలానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించారు.
వర్షం పడితే ముందస్తు సూచనలు వాహనదారులకు ఎలా ఇవ్వాలి.? వారిని ట్రాఫిక్ సమస్య నుంచి ఎలా బయట పడేయాలనే దానిపై పోలీసు అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్స్, యూటర్న్‌ల నిర్వహణపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. అనేక మార్గాల్లో నేటికి ఫ్లైఓవర్ల నిర్మాణం సాగుతోంది. ప్రధానంగా గచ్చిబౌలి ప్రాంతంలో ్లపఓవర్ల నిర్మాణంతో ఇప్పటికే అనేకచోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్‌ను పెట్టారు. వాటి వల్ల వర్షకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాహనదారులను ట్రాఫిక్ నుంచి కాపాడగలమనే అంశాలపై చర్చిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు సైతం నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు సైతం వర్షాకాలంలో అనవసరంగా రోడ్లపైకి రావద్దనే విషయాన్ని పోలీసులు సూచిస్తున్నారు.