Tuesday, November 26, 2024

Spl Story : అన్నదాతలకు ధరణి ధీమా..!

  • దశాబ్దాల భూ సమస్యలకు ధరణితో పరిష్కారం
  • పోర్టల్‌తో తప్పిన తిప్పలు
  • పకడ్బందీగా రిజిస్ట్రేషన్‌
  • పక్కాగా.. పారదర్శకంగా సేవలు
  • మోసాలకు అడ్డుకట్ట.. అవినీతికి చెక్‌
  • మ్యుటేషన్‌, పాస్‌పుస్తకాల జారీ జాప్యానికి చెల్లుచీటి
  • ప్రతి అంగుళం ఆన్‌లైన్‌లో నిక్షిప్తం.. ఎప్పుడైనా చూసుకునే వీలు

భూ సమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర రిజిస్ట్రేషన్‌ సేవల కోసం రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. దశాబ్దాల పాటు చెప్పులరిగేలా తిరిగినా కానీ సమస్యలను క్షణాల్లో పరిష్కరించి క్రయ, విక్రయ దారులకు అండగా నిలుస్తున్నది. 35 నెలలుగా విజయవంతంగా అమలవుతూ రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి స్వచ్ఛత, పారదర్శకతను అందిస్తున్నది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందరికీ బంగారు భరణి అయింది. కాలయాపన, అధికారుల చేతివాటంతో నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన రైతాంగానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేస్తూ భరోసానిస్తున్నది. మెదక్‌ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,12,254, సంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లలో 1,08,144పైగా రిజిస్ట్రేష్రన్లు జరిగాయి.
– ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌

భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను 2020లో అందుబాటు-లోకి తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించి మూడేండ్లు కావస్తున్నది. పైసా లంచం ఇవ్వకుండా భూముల సమస్యలకు శాశ్వత పరిషారాన్ని చూపడంతో పాటు మార్పులు, చేర్పులు అన్నీ ఆన్‌లైన్‌లో చేసుకునేలా ఈ వెబ్‌పోర్టల్‌ను రూపొందించారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటు-న్నారు. తాజాగా, ధరణిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల పరిషారం కోసం ప్రత్యేక సాప్ట్‌nవేర్‌ను రూపొందించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాల జారీ, వారసత్వ బదిలీలు తదితర పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. మెదక్‌ జిల్లాలో 75,363 రిజిస్ట్రేషన్లు, 15,008వేల గిప్ట్‌n డీడ్‌, 12,891 వేల పౌతి, 8992 మార్టిగేజ్‌ మొత్తం 1,12,254 రిజిష్ట్రేషన్లు అయ్యాయి. అంతే కాకుండా భూ సమస్యల పరిషారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్‌ను అధికారులు అందుబాటు-లోకి తెస్తున్నారు. ధరణితో భూ సమస్యలు చకచకా పరిషారమవుతుండడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ధరణి వేదికగా శరవేగంగా మ్యుటేషన్లు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిషారమవుతున్నాయి. ఉమ్మడి పాలనలో రెండు, మూడు నెలల్లో అయ్యే రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ నేడు 15 నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ధరణి పోర్టల్‌ వేదికగా మ్యుటేషన్లు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో భూదందాలతో ఎంతో మంది పట్టాదారులు సమస్యల్లో ఇరుకుపోయారు. అలాంటి ఎంతో మందికి ధరణి పరిషారం చూపుతున్నది. మెదక్‌ జిల్లాలో భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ధరణి పోర్టల్‌తో వాటన్నింటికీ చెక్‌ పెట్టింది.

ఎన్నారైలకు ఎంతో వెసులుబాటు…
ఇప్పటివరకు జఠిల సమస్యగా ఉన్న ఏజీపీఏ, ఎస్పీఏలలో స్టాంపు డ్యూటీ- అడ్జెస్ట్‌మెంట్‌ సేవలను ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం అందుబాటు-లోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ఆప్షన్‌తో ఎన్నారైలకు ఎంతో వెసులుబాటు- కలుగనుంది. ఈ మేరకు జీవో 26ను జారీ చేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లలోని ధరణి సహాయక కేంద్రాలు, మీ సేవల్లో రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యల పరిషారం, సమాచారం కోసం సంప్రదిస్తున్నారు. అయితే, అవగాహనలేమితో తప్పుడు ఆప్షన్‌లో దరఖాస్తు చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, రైతాంగం తమ సమస్యలను పరిషరించుకోలేకపోయారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో తమ సమస్యను ధరణిలోని మాడ్యూల్‌లో నమోదు చేయగానే సమస్య పరిషారం ఎలా.. ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.. ఏఏ పత్రాలు జత చేయాలి అనే వివరాలను సూచిస్తుండడంతో ఎన్నారైలు సులభంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు.

ధరణి

  • స్లాట్‌ బుకింగ్‌ నుంచి రిజిస్ట్రేష్రన్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
  • పక్కాగా, పారదర్శంగా సేవలు అందుతాయి.
  • పోర్టల్‌లో ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తమై ఉంటు-ంది.
  • మోసాలకు ఆస్కారం ఉండదు. గందరగోళం అనే ప్రస్తావనే రాదు.
  • నిమిషాల వ్యవధిలోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అవుతాయి.
  • ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూమి వివరాలు తెలుసుకోవచ్చు.
  • భూముల పంపిణీ, వారసత్వ బదిలీల కోసం వ్యయప్రయాసలు అవసరం లేదు.
  • గతంలో యజమానికి తెలియకుండానే భూ రికార్డుల్లో మార్పులు జరిగేవి. ఇప్పుడు దీనికి ధరణి స్వస్తి పలికింది.
  • కుటు-ంబ సభ్యులు అంగీకార పత్రం రాసిస్తే వెంటనే యాజమాన్య హక్కులు పొందవచ్చు.
  • భూ యజమాని సెల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీ-పీ ఎంటర్‌ చేస్తేనే భూ మార్పులు జరుగుతాయి.
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగాల్సిన అవసరం ఉండదు.
Advertisement

తాజా వార్తలు

Advertisement