న్యూఢిల్లి, (ప్రభ న్యూస్): విమానంలో ప్రయాణించాలనుకునే వారి కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్, బంపర్ ఆఫర్ ప్రకటించింది. అధిక చార్జీల కారణంగా చాలా మంది విమాన ప్రయాణానికి దూరంగా ఉంటారు. విమాన టికెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి (ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధిలో ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు కల్పించనుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు.. వన్ టైమ్ పాస్‌వర్డ్ ధ్రువీకరణ కోసం పాన్ నెంబర్, ఆధార్, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తరువాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్ అవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
స్పైస్ జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్ప భాటియా మాట్లాడుతూ.. కస్టమర్ల సౌలభ్యం మేరకు ఈ ఆఫర్ తీసుకొస్తున్నాం. మొత్తం ప్రయాణ అనుభవాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే సమయంలో.. టికెట్ ధర అనేది ఎప్పటికీ ఆటంకం కావొద్దు. మధ్య తరగతి ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా వెసులు బాటు ఉంటుంది. సులభతరమైన వాయిదా పద్ధతుల్లో డబ్బు లు చెల్లించే అవకాశం ఇస్తున్నాం. కస్టమర్ ఎంచుకున్న ఈఎం ఐకి వ్యవధికి ముందే లోన్‌ను ముగించాలని అనుకున్నట్టయితే.. ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా విధించబడవు.