Friday, November 22, 2024

ఏపీ జెన్కో ప్రాజెక్టులో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతుడిది శ్రీకాకుళం జిల్లా

ముత్తుకూరు, (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కోలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ చ‌నిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్ కేంద్రంలో బూడిద వాహనం (బల్గర్) డ్రైవర్ నిర్లక్ష్యం కార‌ణంగా ప్రాజెక్టులో పనిచేస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఢిల్లీ విశ్వేశ్వరరావు (43 ) దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రాజెక్టు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతా దళాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టులోని మూడవ యూనిట్ యాష్ సైలో నుంచి బూడిద తీసుకెళ్తున్న బల్గర్ వాహనం కార‌ణంగా కానిస్టేబుల్ చ‌నిపోయాడు.

బూడిద లోడింగ్ చేసుకొని ప్రాజెక్టులోకి వస్తున్న బల్గర్ వాహనం ఇండికేటర్ ఉపయోగించకుండా రోడ్డు పక్కకు రావడంతో బైక్ పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ ఈ వాహనం కింద పడి చ‌నిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ మాల్యాద్రితో కలిసి విశ్వేశ్వరరావు బైక్ పై ప్రాజెక్టులో డ్యూటీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది . హెడ్ కానిస్టేబుల్ మాలాద్రికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది గాయపడ్డ మాల్యాద్రిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement