కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి నోయిడాలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌పైకి వేగంగా దూసుకొచ్చిందో కారు. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయన భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కాన్వాయ్‌ను ఢీకొన్నందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే.. కారులో ఉన్న ఇద్దరూ ఫుల్‌గా తాగి ఉన్నారని తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం గవర్నర్ కాన్వాయ్‌ను రెండుసార్లు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి నల్లటి స్కార్పియో కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్‌గా గుర్తించారు. సెక్టార్ 77లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నోయిడా వచ్చారు.