హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాదిలోపు యాదాద్రి పవర్‌ప్లాంటులోని రెండు యూనిట్లను కమిషన్ చేసి, మరో యూనిట్‌కు సింక్రనైజ్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సూచించారు. భవిష్యత్‌లో కరెంట్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం సంబందిత అధికారులతో ప్రభాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని కోరగా.. బీహెచ్‌ఈఎల్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.
యాదాద్ర పవర్ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లకు గాను రెండు యూనిట్లలో 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నారు. దానికి తోడు మరో యూనిట్‌ను సింక్రనైజ్ చేయాలన్నారు. వచ్చే రెండేళ్లలో మిగతా వాటిని కూడా అనుసంధానం చేయాలన్నారు. కరోనా వలన పనులు కొంత ఆలస్యం అయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో పనులు వేగవంతం చేస్తామవని బీహెచ్‌ఈల్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. అనుకున్న సమయానికి మొదటి యూనిట్‌ను అనుసంధానం చేస్తామని, కేటీపీఎస్‌లో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..