Tuesday, November 26, 2024

Special Trians: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌… సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగ‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ప‌లు రూట్ల‌లో ప్ర‌త్య‌క రైళ్ల‌ను న‌డిపించేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతికి జనవరి 1 నుంచి 19 వరకు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నడుస్తున్న 278 రైళ్లకు అదనంగా పండుగ సమయంలో మరిన్ని నడుస్తాయని తెలిపారు. ఈ మేరకు తేదీల వారీగా నడిచే రైళ్ల వివరాలను వెల్లడించారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..
మచిలీపట్నం – కర్నూల్ సిటీ
( తేదీలు :- 3, 5, 7, 10, 12, 14, 17)
తిరుప‌తి సిటీ – మచిలీపట్నం
( తేదీలు:- 4, 6, 8, 11, 13, 15, 18)
మచిలీపట్నం – తిరుపతి
( తేదీలు:- 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16)
తిరుపతి – మచిలీపట్నం
( తేదీలు:- 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17)
విజయవాడ – నాగర్‌సోల్
( తేదీలు:- 6, 13)
నాగర్ సోల్ – విజయవాడ
( తేదీలు:- 7, 14)
కాకినాడ టౌన్ – లింగంపల్లి
( తేదీలు:- 2, 4, 6, 9, 11, 13, 16, 18)
లింగంపల్లి – కాకినాడటౌన్
( తేదీలు:- 3, 5, 7, 10, 12, 14, 17, 19)
పూర్ణ – తిరుపతి
( తేదీలు:- 2, 9, 16)
తిరుపతి – పూర్ణ
( తేదీలు:- 3, 10, 17)
తిరుపతి – అకోలా
( తేదీలు:- 6, 13)
అకోలా – తిరుపతి
( తేదీలు:- 8, 15)
మచిలీపట్నం – సికింద్రాబాద్
( తేదీలు:- 1, 8, 15)
సికింద్రాబాద్ – మచిలీపట్నం
( తేదీలు:- 1, 8, 15)

Advertisement

తాజా వార్తలు

Advertisement