Friday, November 22, 2024

పాత పద్ధతిలోనే రైళ్లు..

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ దగ్గర నుంచి రైల్వే శాఖ కేవలం ‘స్పెషల్‌ ట్రైన్స్‌’ ను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచింది కూడా. తొలుత దూర ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య కూడా నడపడాన్ని ప్రారంభించింది. పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నెంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వే బోర్డు అన్ని జోనల్‌ కార్యాలయాలకు లేఖలు రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement