దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ఆయా రూట్లలో నడుపుతుంది. ఇందులో భాగంగానే గుంటూరు మీదగా వెళ్లే రూట్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. గుంటూరు మీదుగా వివిధ ప్రాంతాలకు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు.07645 సికింద్రాబాద్ – సంత్రగచి ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీన ఉదయం 8.40కి బయలుదేరి ఉదయం 10.25కి సంత్రగచి చేరుకొంటుంది. నెంబరు.07646 సంత్రగచి – సికింద్రాబాద్ రైలు ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకొంటుంది. నెంబరు.07169 నరసాపూర్ – సికింద్రాబాద్ రైలు ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 4.10కి సికింద్రాబాద్ చేరుకొంటుంది. నెంబరు.07485 సికింద్రాబాద్ – తిరుపతి రైలు ఈ నెల 19వ తేదీన రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతి చేరుకొంటుంది.
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..
Advertisement
తాజా వార్తలు
Advertisement