అమరావతి, ఆంధ్రప్రభ : వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్ల ను నడుపుతోంది. 07509 హైదరాబాద్- తిరుపతి జూన్ 4, 11వ తేదీలలో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు చేరుకోనుంది. అలాగే 07510 తిరుపతి – హైదరాబాద్ 7, 14వ తేదీలలో రాత్రి 11.50 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు, 07531 తిరుపతి – కాకినాడ టౌన్ 5, 12వ తేదీలలో సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు, 07532 కాకినాడ టౌన్ – తిరుపతి 6, 13వ తేదీలలో రాత్రి 7.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు చేరుకోనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..