గుంటూరు, ప్రభన్యూస్‌బ్యూరో: ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో విజయవాడ తర్వాత కీలకమైన గుంటూరు రైల్వే డివిజన్ నుంచి సంక్రాంతిని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్ళను నడపనున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను గుంటూరు డివిజనల్ రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు గుంటూరు మీదుగా నరసాపూర్, మచిలీపట్నం, కాకినాడ టౌన్‌కి వెళతాయి. ప్రయాణీకులు పీఆర్‌ఎస్ కౌంటర్లతో పాటు- ఐఆర్‌సీటీ-సీ, యాప్‌వెబ్‌సైట్‌లో రిజర్వుడ్ టిక్కెట్‌లు బుకింగ్ చేసుకోవచ్చు. జనరల్ బోగీలలో ప్రయాణించదలచిన వారు రైల్వేస్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ దృష్ట్యా యూటీఎస్ మొబైల్ యాప్‌ని వినియోగించి బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రత్యేక రైళ్ళ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఈ నెల 9న నెంబరు. 07039 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 10న నెంబరు. 07040 కాకినాడ టౌన్ – వికారాబాద్, 11న నెంబరు 07041 వికారాబాద్ – నరసాపూర్, నెంబరు. 07035 సికిందాబ్రాద్ – కాకినాడ టౌన్, 12న నెంబరు. 07042 నరసాపూర్ – సికింద్రాబాద్, నెంబరు.07036 కాకినాడ టౌన్ – వికారాబాద్, 13న నెంబరు 07037 వికారబాద్ – కాకినాడ టౌన్, నెంబరు 07023 సికింద్రాబాద్ – నరసాపూర్, 14న నెంబరు 07038 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, నెంబరు 07024 నరసాపూర్ – సికింద్రాబాద్, 15న నెంబరు. 07031 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 16న నెంబరు. 07027 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, నెంబరు. 07032 కాకినాడ టౌన్ – వికారాబాద్, 17న నెంబరు .07028 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, నెంబరు 07033 వికారాబాద్ – కాకినాడ టౌన్, 18న నెంబరు. 07034 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లని నడపనున్నారు. కాగా ఈ రైళ్లకు నడికుడి, సత్తెనపల్లిలో నిలుపుదల సౌకర్యం ఉన్నట్లు- చెప్పారు.