అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల కోసం వివిధ ప్రాంతాల నుంచి 4 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెం 07677 సికింద్రాబాద్ – విశాఖపట్నం ఈ నెల 11వ తేదీన ఉదయం 5.50 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.15 గంటలకు చేరుకోనుంది. అలాగే 07678 విశాఖపట్నం – సికింద్రాబాద్ 12న రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు, 07615 నెల్లూరు – సేలం 11న ఉదయం 7.05 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు, 07676 సేలం – నెల్లూరు 12న రాత్రి 8.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు చేరుకోనుంది. 07677, 07678 రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో, 07675, 07676 రైళ్లు గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై స్టేషన్లలో ఇరువైపు ప్రయాణాల్లో ఆగుతాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.