Tuesday, September 17, 2024

Good News | ఈ ప్రత్యేక రైళ్లతో పండ‌గ‌ చేసుకోండి…

దసరా, దీపావళి పండుగలను సంద‌ర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ద‌క్షిన మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ‌ల దృష్ట్యా ర‌ద్దీ కార‌ణంగా ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా.. ప్ర‌త్యేక ట్రైన్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు ప్ర‌కటించింది. ఈ మేరకు దసరా, దీపావళి, ఛత్ పండుగలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

ప్ర‌త్యేక రైళ్లు ఇవే !

కాచిగూడ – తిరుపతి (07653)
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు ఈ ట్రైన్ సర్వీసులు అందిస్తుంది. ఈ ట్రైన్ కాచిగూడ వద్ద రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 10.10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆరు గురువారాలు సర్వీస్ అందిస్తుంది.

తిరుపతి – కాచిగూడ (07654)
అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15వ తేదీ (ప్రతి శుక్రవారం సేవలు) వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. తిరుపతి స్టేషన్‌లో ఈ ట్రైన్ రాత్రి 8.05 గంటలకు డిపార్చర్ అవుతుంది. తర్వాతి రోజు రాత్రి 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

- Advertisement -

సికింద్రాబాద్ – నాగర్సోల్ (07517)
అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ (ప్రతి బుధవారం అందుబాటులో సికింద్రాబాద్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటుంది.) వరకు ఈ రైలు ఈ సర్వీసు ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

నాగర్‌సోల్ – సికింద్రాబాద్ (07518)
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 7వ తేదీ (ప్రతి గురువారం) వరకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 10 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07122)
అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4వ తేదీ ( ప్రతి సోమవారం) వరకు ఈ ట్రైన్ సర్వీసులు అందిస్తుంది. సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07188)
అక్టోబర్ 8 నుంచి నవంబర్ 5వ తేదీ (ప్రతి మంగళవారం) వరకు ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 8 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక ట్రైన్‌లలో ఫస్ట్ ఏసీ కమ్ 2ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాసు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ఎస్‌సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement