Tuesday, November 19, 2024

రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచు కుని విశాఖపట్నం – తిరుపతి, తిరుపతి – విశాఖపట్నం మధ్య 44 వీక్లీ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్‌ నం. 08581/ 82/83/84విశాఖపట్నం- తిరుపతి, ఈ నెల 17నుంచి జూన్‌ 26 వరకు (ఆదివారాల్లో మాత్ర మే) రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.22 గంటలకు చేరుకుంటుంది అలాగే తిరుపతి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 18 నుంచి జూన్‌ 27 వరకు(సోమవారాల్లో) రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చేరేలా నడుస్తుంది.

విశాఖపట్నం – తిరుపతి (సోమవారం) ఈ నెల 18 నుంచి జూన్‌ 27 వరకు రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు చేరుతుంది. తిరుపతి- విశాఖపట్నం రైలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తీ, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ టూ టైర్‌, ఏసీ త్రీ టైర్‌, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement