Tuesday, November 26, 2024

TS | వీఐపీల డ్రైవర్లకు ప్రత్యేక పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం ఘటనతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వీఐపీల కార్లను నడిపే వారికి ప్రత్యేక పరీక్షలు పెట్టనున్నారు. వీఐపీ డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతిభ లేని డ్రైవర్లను నియమించుకోవద్దని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణాశాఖ ఈ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.

ఆటో డ్రైవర్లకు త్వరలోనే రూ.12వేలు

అదేవిధంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సాయం పథకంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మీ పథకంలో కండక్టర్లు అనవసరంగా టికెట్లు జారీ చేసినట్లు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement