Tuesday, January 7, 2025

TG | డ్ర‌గ్స్ నియంత్రణకు ప్రత్యేక టీమ్….

రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు ఎక్సైజ్‌ శాఖలో నార్కోటిక్‌ ఎన్‌డీపీఎస్‌ నియంత్రణకు కొత్త ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు.

నార్కోటిక్‌ టీమ్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో ఎన్‌ఫోర్స్‌, డిటిఎఫ్‌, డిటిఎఫ్‌ టీమ్‌లో చురుకుగా పని చేస్తున్న వారిలో మంచి నైపుణ్యం కనబరుస్తున్న వారితో పాటు, ఈ విభాగంలో పని చేయడానికి ఉత్సహాం చూపేవారిని తీసుకోవాలని డైరెక్టర్‌ అదేశించారు.

టీమ్‌లో సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిసి మొత్తంగా 15 నుంచి 20 మంది సిబ్బంది ఉండే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నార్కోటిక్‌ టీమ్‌ ఏర్పాటుకు ప్రధానంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో డ్రగ్స్‌ వినియోగం పెరగడమే కారణమన్నారు.

నార్కోటిక్‌ టీమ్‌ ప్రధానంగా మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పని చేస్తుందన్నారు. నల్లమందు మార్ఫిన్‌, హెరాయిన్‌, గంజాయి, కోకైన్‌, హషిస్‌ అయిల్‌, పాపిష్టతో పాటు ఇతర డ్రగ్స్‌కు సంబంధించిన వాటిపై ప్రత్యేకంగా ఈ టీమ్‌ను నియమించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement