Tuesday, November 26, 2024

Special Story టెర్ర‌ర్‌కే .. టెర్ర‌ర్‌! టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే

మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ స్పై ఏజెన్సీ మొసాద్‌

ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఎత్తుగ‌డ‌లుటాప్

మోస్ట్ స్పై ఏజెన్సీగా ఇజ్రాయెల్ గూఢ‌చార సంస్థ‌

తొలినాళ్ల‌లో ఇంటెలిజెన్స్ స‌ర్వీస్ ఏజెన్సీగా ప్రారంభం

అమెరికా స్పై ఏజెన్సీ సీఐఏకి దీటుగా ఎదిగిన తీరు

- Advertisement -

ఇరాన్‌, లెబ‌నాన్‌, హిజ్‌బోల్లాపై వార్‌లో కీల‌క పాత్ర‌

పేజ‌ర్లు, వాకీటాకీల పేలుళ్ల‌కు ప‌క‌డ్బందీ ప్లాన్‌

హ‌మాస్ టాప్ క‌మాండ‌ర్‌ ఇంట్లోనే బాంబు బ్లాస్ట్‌

టెర్ర‌ర్ చీఫ్‌ న‌స్ర‌ల్లాని హ‌త‌మార్చ‌డంలోనూ కీల‌క‌పాత్ర

1996 గాజా.. ‘‘ది ఇంజినీర్’’ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌

ప్ర‌త్యేక వెబ్‌సైట్‌, రిక్రూట్‌మెంట్‌కు ఫేస్‌బుక్ పేజీ

టు సీ ద ఇన్విజ‌బుల్.. అండ్ డూ ద ఇంపాజిబుల్

ఇదే మొస్సాద్ ట్యాగ్‌లైన్‌

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:ఇజ్రాయెల్‌తో గేమ్స్ ఆడే యత్నం చేసే ఎవ్వరైనా స‌రే.. మొసాద్ నుంచి తప్పించుకోలేరు. బ్రిటీష్‌ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్-007 అందరికీ తెలుసు. కానీ, ఇజ్రాయెట్ సీక్రెట్ స్పై మొసాద్ గురించి త‌క్కువ మందికే తెలుసు. మిడిల్ ఈస్ట్‌లో తీవ్రవాద గ్రూపులకు, పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ కోవర్టులకు మొసాద్ పేరు వింటేనే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి.

అవును, ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మొసాద్ పేరుగాంచింది. ఇజ్రాయిల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా 1947లో ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ.. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

పేజ‌ర్లు, వాకీటాకీల పేల్చి వేత

.సెప్టెంబర్ 17న లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లు వేల సంఖ్యలో పేలిపోయాయి. హిజ్బుల్లా టెక్స్ట్ మెసేజ్‌ల కోసం వాడే ఈ పేజర్లు లెబనాన్ వ్యాప్తంగా ఏకకాలంలోనే పేలిపోయాయి. బీరుట్‌లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది చ‌నిపోయారు. దాదాపు మూడు వేల మందికి పైగా గాయపడ్డారు.

ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకొని, తేరుకునే లోపే, లెబనాన్ బీరుట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లో భారీ సంఖ్యలో వాకీ-టాకీలు కూడా పేలడం మొద‌ల‌య్యింది.హ‌ఠాత్తుగా ప్రారంభ‌మై.. సెప్టెంబర్ 18న జరిగిన‌ వాకీ-టాకీ పేలుళ్లలో 20 మంది చ‌నిపోగా, దాదాపు 500 మందికి పైగా గాయపడ్డారు.

ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ గ్రూపు హిజ్బుల్లాపై హఠాత్తుగా ప్రారంభమైన ఈ సీక్రెట్ దాడులు అంతే సాధారణంగా ముగిశాయి. ఎవరు చేశారు. ఎందుకు చేశారన్నది అంద‌రికీ తెలిసిన విష‌య‌మూ అయినా.. దీనికి పూర్తిస్థాయిలో ఆధారాలు లేవు. అయితే, ఈ దాడికి సంబంధించి అందరి చూపులు మాత్రం ఇజ్రాయెల్ పైకే మళ్లాయి.

ఎందుకంటే, ఆ దేశం వాడే సీక్రెట్ హైటెక్ టెక్నాలజీ అలాంటిది. అంతకుమించి, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సామర్థ్యం మ‌రో లెవ‌ల్‌లో ఉంటుంది. అందులోనూ, మొసాద్ అంటేనే ఇలాంటి ఆపరేషన్లకు పెట్టింది పేరు.

అమెరికా సీఐఏ కూడా మొసాద్‌ను చూసి నేర్చుకోవాలనే విధంగా ఆ ఏజెన్సీ కామ్‌గా పని కానిచ్చేస్తుంది.1996 గాజాలో.. ది ఇంజినీర్ ఆప‌రేష‌న్‌..ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు ఇలాంటి పనుల్లో ఆరితేరింది. 1996లో గాజాలో “ది ఇంజనీర్” అనే పేరుతో ఫేమస్‌ అయిన, హమాస్‌ మాస్టర్ బాంబ్ మేకర్, యాహ్యా అయ్యాష్‌ను హతమార్చడానికి సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే మొసాద్ అమలు చేసింది.

రహస్యంగా పేలుడు పదార్థాలతో అమర్చిన మొబైల్ ఫోన్‌ను ఈ ఆపరేషన్‌లో ఉపయోగించారు. అలాగే, 1972లోనూ మొసాద్ సీక్రెట్ టీమ్ ఇదే తరహాలో పాలస్తీనా లిబరేషన్ కార్యకర్త మహమూద్ హంషారీని హత్య చేశారు. మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా, పారిస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో హంషారీ ఉపయోగించిన ఫోన్‌కు మొసాద్ స్పైలు రిగ్గింగ్ చేశారు. హంషారీ ఫోన్ లేపగానే రిమోట్‌తో ఫోన్‌లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పేల్చేశారు

తొలి రిమోట్‌ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్, బేనెట్ అని దీనికి పేరు. ఇక, అదే ఏడాది, పాలస్తీనా లిబరేషన్ ప్రతినిథి, బస్సమ్ అబు షరీఫ్‌ను బీరూట్‌లో పుస్తకంలో అమర్చిన బాంబ్‌తో మొసాద్ పేల్చేసింది. మొసాద్ పనితనానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి.

హ‌మాస్ అగ్ర క‌మాండ‌ర్ ఇంట్లోనే..అంచనాలకందని వ్యూహాలను అమలు చేసి, విదేశాల్లోని ప్రత్యుర్థులను మట్టుబెట్టడంలో మొసాద్ ఆరితేరింది. లెబనాన్‌ పేజర్ దాడులకు ముందు, కొద్ది నెలల కిందటే పాలస్తీనా సాయుధ మిలిటెంట్ సంస్థ హమాస్ అగ్ర కమాండర్ ఇస్మాయిల్ హనియే, ఇరాన్ పర్యటనలో ఉండగా.. ఆయన ఉండే ఇంట్లో బాంబు పేల్చి హతమార్చిందీ మొసాద్ ఏజెన్సీనే.

ఈ చర్య తర్వాతే ఇరాన్‌, హిజ్బుల్లాకూ.. ఇజ్రాయెల్‌కు మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అది, లెబనాన్‌లో పేజర్లు పేలడానికి, తర్వాత ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేయడానికి కారణం అయ్యింది.టాప్ మోస్ట్ స్పై ఏజెన్సీగా మొసాద్‌..సుమారు మూడు బిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్‌తో, ఏడు వేల మంది సిబ్బందితో అమెరికన్ సీఐఏ తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో రెండో అతిపెద్ద గూఢచర్య సంస్థ మొసాద్. అందుకే, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వారిలో మొసాద్‌ చీఫ్‌ ఒకరిగా ఉంటారు.

ప్రస్తుతం, మొసాద్ డైరెక్టర్‌గా ‘డాడీ’ అనే నిక్ నేమ్ ఉన్న డేవిడ్ బర్నియా ఉన్నారు. జూన్ 2021లో యోస్సీ కోహెన్ నుండి డాడీ బాధ్యతలు స్వీకరించారు. ఇక, మొసాద్ స్పై మాస్టర్లలో మొత్తం 13 మంది పురుషులు కాగా, ఇటీవలి కాలంలో ఏజెన్సీలో కొత్త ఒరవడి వచ్చింది. మొసాద్‌కు వెబ్‌సైట్‌ ఉంది. మొసాద్ రిక్రూటింగ్‌లో సాయం చేయడానికి ఫేస్‌బుక్ పేజీని కూడా నిర్వహిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement