Monday, November 18, 2024

అంకాలజీ క్యాంపునకు విశేష స్పందన : మంత్రి గంగుల

హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌ లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల జరిగింది. అంకాలజీ సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన 500 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపు స్థానిక ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో 500 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపులో సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ జగదీశ్వర్ గౌడ్, డాక్టర్ గంగాభవాని, గైనకాలజిస్టుల బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…. కరీంనగర్‌లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపునకు విశేష స్పందన వచ్చిందన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న నిరంతర సేవలను అభినందించారు. అలాగే సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి అవగాహన పెంచేందుకు కృషి చేస్తోందని వివరించారు. క్యాన్సర్ వ్యాధిపై అన్ని వర్గాల్లో అవగాహన పెంచేందుకు తరుచూ ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కోరారు. వ్యాధుల సోకడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించినప్పుడు అవి సోకకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని, వ్యాధి ప్రబలిన తరువాత ఆందోళన చెందడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుని దాని బారిన పడకుండా ఉండేందుకే చొరవ చూపాల్సిన అవసరముంద‌న్నారు.

ఏవోఐ ప్రాంతీయ సీఓఓ డాక్టర్ ప్రభాకర్ పాలచర్ల మాట్లాడుతూ… శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు మొదట్లోనే వ్యాధి లక్షణాలను గుర్తించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక ప్రయత్నించామన్నారు. తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడమే అత్యంత కీలకమన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ రెగ్యులర్ స్క్రీనింగ్‌ను చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు క్లినికల్ నైపుణ్యంపై ఆధునిక సాంకేతికతతో సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. AOI అనేది క్యాన్సర్ వ్యాధి గ్రస్తుాలకు సేవలందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ అని వివరించారు. ఉచిత అల్ట్రాసౌండ్, పాప్ స్మెర్ పరీక్షలు, ఇతర ల్యాబ్ పరీక్షలను కేవలం లక్షణాలున్న రోగులకు మాత్రమే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా వైద్య అధికారి జువేరియా, కార్పోరేటర్ మేచినేని వనజ-అశోక్ రావులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement