నాగార్జునసాగర్ , నందికొండ (ప్రభ న్యూస్) : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ లోని బుద్ధ వనానికి బౌద్ధ గురువులు వస్తున్నారు. సోమవారం గౌతమబుద్ధుని 2566 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు, బౌద్ధ భిక్షువులతో సంప్రదాయబద్ధంగా వాయిద్యాలు చేసుకుంటూ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. వంఅనంతరం మహా స్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో మైసూర్ నుండి వచ్చిన వారు ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘపాలబంతే మాట్లాడుతూ బుద్ధుడు పుట్టినటువంటి నేపాల్‌లోని లుంబిని, బుద్ధునికి జ్ఞానోదయం అయిన బిహార్ రాష్ట్రంలోని బుద్ధ గయ, బుద్ధుని ధర్మ చక్ర పరివర్తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సారనాథ్, బుద్ధుడు నిర్యాణం పొందిన కృషి నగర్ లాగా బుద్ధవనం ప్రాజెక్టు ఈ నాలుగింటిని సమ్మేళనం చేస్తూ భవిష్యత్తులో ప్రఖ్యాతి పొందుతుందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..