Tuesday, November 26, 2024

డయాలసిస్‌ రోగుల కోసం ప్రత్యేక పోర్టల్‌.. రోగుల వివరాలను తప్పక నమోదు చేయాల్సిందే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో అందించే డయాలసిస్‌ వైద్య సేవలను ఇకపై ప్రధానమంత్రి నేషనల్‌ డయాలసిస్‌ పోర్టల్‌లో తప్పక నమోదు చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు పోర్టల్‌ను అన్ని విధాలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు చెప్పింది. పోర్టల్‌లో డయాలసిస్‌ రోగుల వివరాలు, వైద్య సేవలను అప్‌ లోడ్‌ చేసే అంశంలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రతీ పేషెంట్‌కు ప్రత్యేకంగా యూనిక్‌ ఐడీ నంబరును కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేకంగా సర్క్యులర్‌ను విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement