Monday, November 25, 2024

Pawan Kalyan | టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. దేవాలయం, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. దేవాలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచంలోని చాలా దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని అన్నారు.

రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement