న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరిలు అడిగిన ప్రశ్నలకు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆర్ధిక లోటు భర్తీకి 14వ ఆర్ధిక సంఘం నిధులు కేటాయించిందని అన్నారు.
దీంతో ప్రత్యేక రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మద్య తేడా లేకుండా పోయిందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేశామని నిత్యానందరాయ్ వెల్లడించారు. 2015 నుంచి 2018 వరకూ ఈఏపీ పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని చెల్లించామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.