స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో భారత బృందం 150 పతకాల మార్కును దాటింది. రోలర్ స్కేటర్లు ఆదివారం రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించిపెట్టారు. మొత్తంగా ఇండియా 157 పతకాలు (66 స్వర్ణాలు, 50 రజతాలు, 41 కాంస్యాలు) దక్కించుకుంది. భారత పురుషుల మిుక్స్‌డ్ బాస్కెట్‌బాల్ జట్టు 6-3తో పోర్చుగల్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్‌లో స్వీడన్ చేతిలో ఓడిన మహిళల జట్టు రజతంతో సరిపెట్టుకుంది.
వాలీబాల్ పురుషుల మిక్స్‌డ్ కాంస్యం పోరులో భారత్ 2-0తో కొరియాపై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో టాప్సీటర్వీ యూఏఈని ఓడించి భారత్‌కు స్వర్ణపతకాన్ని సాధించిపెట్టారు. టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ లెవల్ 5 ఈవెంట్‌లో స్వరాజ్ సింగ్ తమస్‌బోరోక్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల హ్యాండ్‌బాల్ ఫైనల్‌లోనూ అజర్‌బైజాన్ చేతిలో ఓడిన భారత్ రజతం దక్కించుకుంది. మొత్తంగా ఈ ఈవెంట్‌లో 198 మంది అథ్లెట్ల బృందం భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది.