ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు మంచి ఆఫర్ను ప్రకటించింది. కంపెనీకి చెందిన మెజార్టీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా శాశ్వతంగా పని చేసుకునే వెసులుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్, బిజినెస్ ఫంక్షన్, టెక్నాలజీ విభాగాలకు చెందిన ఉద్యోగులు రిమోట్గా పని చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగులంతా బేస్ లొకేషన్లో కలుస్తారని కంపెనీ తెలిపింది.
కలిసి పని చేయాల్సిన విభాగాల్లోని ఉద్యోగులు మాత్రం వారంలో కొన్ని రోజులు కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుందన వెళ్లడించింది. కంపెనీకి చెందిన మేనేజర్లు, ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్విగ్గీలో ప్రస్తుతం 487 నగరాల్లో 5 వేల మంది వరకు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.