Friday, November 22, 2024

రసాయన, అణు బాధితుల చికిత్స కోసం.. ప్రత్యేక వైద్య కేంద్రాలు

రసాయన, జీవ, రేడియోలాజికల్‌, అణు సంఘటనలు లేదా దాడులకు గురైన వ్యక్తుల చికిత్స కోసం ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ పేలుడు, తుగ్లకాబాద్‌ గ్యాస్‌ లీక్‌, కాన్పూర్‌ అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ తదితర పారిశ్రామిక ప్రమాదాల ఘటనల నేపథ్యంలో సరికొత్త తరహా వైద్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రసాయన, జీవ, అణు బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలు అందజేయడమే వీటి ప్రధాన లక్ష్యం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత ఢిల్లిdలోని ఝాజ్జర్‌ ఎయిమ్స్‌ క్యాంపస్‌, చెన్నైలోని స్టాన్లీ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు రసాయన, జీవ, రేడియోలాజికల్‌, న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. రూ.230 కోట్ల అంచనా వ్యయంతో ఈ రెండు ఆరోగ్య కేంద్రాలను ఏడాదిన్నర వ్యవధిలో అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఏడు సెకండరీ స్థాయి సీబీఆర్‌ఎన్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement