తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. కంటెస్టెంట్స్ పాటలకి డాన్స్ చేసి ఆయనకు ఆయనే సాటి అని నిరూపించారు. ప్రణతి వాళ్ళ అమ్మతో కలిసి ‘సందెపొద్దుల కాడ’ అని పాడటంతో, ఆయన వారిరువురి పాటకి స్టెప్స్ వేసి, ప్రణతి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. శ్రీనివాస్ పాటకి మంత్రముగ్ధుడు అయ్యి, తానే తెలుగు ఇండియన్ ఐడల్ డైరెక్ట్ చేస్తా అన్నారు. జయంత్ పాటకి ఖైదీ 150 సినిమా ట్యూన్ కి సిగ్నేచర్ స్టెప్ జయంత్ తో పాటు వేసి, తనకు కూలింగ్ గ్లాస్ కూడా బహుకరించారు. మరి మెగాస్టార్ తో మెగా ఫినాలే అంటే అలానే ఉంటుంది మరి! ఇంకా అయన ఏం చేసారు, ఎలా అందరిని ప్రోత్సహించారో తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం ఆహ చూడాల్సిందే.ఆహా గ్రాండ్ ఫినాలే ను ఆహా అనేట్టుగా మార్చేసింది. అబ్బురపరిచే జడ్జెస్ పెర్ఫార్మన్స్, కంటెస్టెంట్స్ పాటలతో పాటు రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. రానా, రామ్ చరణ్ చిన్ననాటి జ్ఞాపకాలను చిరంజీవి గారు చెప్పగా, సాయి పల్లవి అందరి కంటెస్టెంట్స్ ను ప్రోత్సహించింది.15 వారాల సంగీత ప్రయాణం ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ వేదిక మీదుగా వచ్చి, అందరి మనసులు గెలిచి, జడ్జెస్ యొక్క సలహాలను పాటించి, ఇప్పుడు తెలుగు ఇండియన్ ఫైనలిస్ట్స్ గా నిలిచారు. ఇందులో ఎవరు గెలవనున్నారో తెలియాలంటే ఈ 17 న ఆహ తప్పక చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement