పట్టణంలో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించినట్లు పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోగల కూరగాయల మార్కెట్, జెండా చౌరస్తా, సుభాష్ నగర్, కమాన్ రోడ్డు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బావుండాలని, ప్లాస్టిక్ రహిత పెద్దపల్లి గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి పట్టణంలో డ్రైనేజీ లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ చేయాలని దోమలను నివారించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement