తిరుమల , ప్రభన్యూస్ : నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబర్ నలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 1 న బృహత్యుమాసవ్రతం (ఉండ్రాళ్లతద్దె), 3న మధ్యాష్టమి, 10న మతత్రయ ఏకాదశి, 13న మాసశివరాత్రి, అక్టోబర్ 14న మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంతదేశిక ఉత్సవం ప్రారంభం.
ఇక 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, సరస్వతిపూజ, 21న దేవి నవరాత్రి వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరునక్షత్రం, 22న స్వర్ణరథోత్సవం, దుర్గాష్టమి, 23 న చక్రస్నానం, మహర్నవమి మరియు విజయదశమి, వేదాంత దేశిక సాత్తుమొర, పిళ్ళైలోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 24న పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25న మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 28న పాక్షిక చంద్రగ్రహణం, అక్టోబర్ 31న చంద్రోదయోమ వ్రతం (అట్లతద్దె) పర్వదినాలు టిటిడి వైభవంగా నిర్వహించనుంది.