Friday, November 22, 2024

ఆకతాయిల పని పట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌.. ఏసీపీ గిరిప్రసాద్‌

మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధింపులకు గురి చేసే ఆకతాయిల ఆట కట్టించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఖని ఏసీపీ గిరిప్రసాద్‌ తెలిపారు. గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా అదుపులోకి తీసుకున్న యువకులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలోని గోదావరిఖని వన్‌ టౌన్‌ టౌన్‌, టూటౌన్‌, రామగుండం మంథని సర్కిల్‌ల పరిధిలో పరీక్షా కేంద్రాల వద్ద కాలేజీల వద్ద, కాలేజీ బయట, ఇతర చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో మప్టీలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాలేజీ విద్యార్థులను ఈవ్‌ టీజింగ్‌ చేస్తున్న, రాష్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌లో పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతోపాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులను సహించాల్సిన అవసరం లేదని, మహిళలకు అండగా పోలీసులు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఏసీపీ సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఆకతాయిలపై ఎల్లప్పుడు నిఘా ఉంటుందని, స్పెషల్‌ డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తామన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే డయల్‌ లేదా షీ టీమ్‌ వాట్సాప్‌ నంబర్‌ 6303923700 కు కాల్‌ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐలు రమేష్‌ బాబు, రాజ్‌ కుమార్‌ గౌడ్‌, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ శైలజ, ఎన్టిపిసి ఎస్‌ఐలు స్వరూప్‌ రాజ్‌, కె.కుమార్‌ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement