Thursday, September 12, 2024

HYDRAA | జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) ఏర్పాటైన తరహాలో రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు జిల్లాల్లో వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించారు. ఆక్రమణ దారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా వారిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతాం.. ప్రజాప్రతినిధులు కావొచ్చు, సమాజంలో బాగా ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవారు కావొచ్చు.. ఎలాంటి ఒత్తిడి వచ్చినా తట్టుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చెరువులు, కుంటలు, కాల్వలు, నాలాలకు సంబంధించి ఆక్రమణలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటాం, ఆక్రమణలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామం”అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement