Tuesday, November 26, 2024

ఇంట‌ర్ స్టూడెన్స్ కు స్పెష‌ల్ క్లాసులు.. ఫైన‌ల్ ఎగ్జామ్స్​కి స‌న్న‌ద్ధం చేయాలి: ఇంట‌ర్ బోర్డ్..

ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతున్నందున సిలబస్‌ను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం అవసరమైతే స్పెషల్‌ క్లాసులు పెట్టైనా సిలబస్‌ను పరీక్షలకు ముందే మొత్తం పూర్తి చేయాలని సూచించారు. ఈమేరకు బోర్డు సెక్రటరీ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో డిస్ట్రీక్ట్‌ ఇంట ర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు, నోడల్‌ అధికారులకు ఆదేశించారు.

మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 20 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సిలబస్‌ బోధనపై అధికారులు దృష్టి సారించారు. ఈక్రమంలోనే ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో త్వరగా సిలబస్‌ను పూర్తి చేయాలని సూచించారు. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం ఈసారి కూడా 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement